మీలో ఎవరు సి‌ఎం అభ్యర్థి?

95
- Advertisement -

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీలో పోలిటికల్ హిట్ ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా అధికార వైసీపీ, జనసేన మద్య జరుగుతోన్న రాజకీయ రగడ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది. ఈ మద్య తరచూ తన వ్యాఖ్యలలో ఘాటు పెంచుతూ వైసీపీ నేతలపై విరుచుకు పడుతున్న పవన్.. తాజాగా మరోసారి వైసీపీ నేతలపై తనదైన రీతిలో నిప్పులు చెరిగారు. వైసీపీ వాళ్ళను బ్రిటిష్ వాళ్ళతో పొలుస్తూ తనదైన రీతిలో పంచు డైలాగులు విసిరారు. అయితే పవన్ చేసిన కామెంట్స్ వైసీపీ నేతలు కూడా గట్టిగానే రీప్లే ఇచ్చారు. పవన్ ను కే‌ఏ పాల్ తో పొలుస్తూ లైట్ తీసుకుంటున్నారు. .

ఇదిలా ఉంచితే పవను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి. ” పవన్.. ఎవరికోసం పని చేస్తున్నాడో చెప్పాలని, చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురిలో సి‌ఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని ” సజ్జల వ్యాఖ్యానించారు. దీంతో పవన్, చంద్రబాబు, లోకేశ్ ముగ్గురిలో సి‌ఎం అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని, పొత్తులకు తాము సిద్దమే అని పవన్ పదే పదే చెబుతున్నారు. అంతే కాకుండా ఇటీవల చంద్రబాబు, పవన్ కూడా పలుమార్లు భేటీ కావడంతో జనసేన, టీడీపీ దోస్తీ ఖాయమే అనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.

ఒకవేళ ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదిరితే సి‌ఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరమే.. ఎందుకంటే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో ఎన్నికల్లో గెలిచి చివరిగా సి‌ఎం పదవి అధిష్టించి రాజకీయాలకు విరామం ఇవ్వాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఒక్క ఛాన్స్ అంటూ పవన్ కూడా ఈసారి సి‌ఎం పదవి పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. దాంతో పవన్ గతంలో మాదిరి వెనుకడుగు వేసేటట్లు కనిపించడం లేదు. ఇక మరోవైపు నారా లోకేశ్ కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ గెలిస్తే చంద్రబాబు సి‌ఎం పదవిని నారా లోకేశ్ కి కట్టబెడతారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో సి‌ఎం అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. అటు వైసీపీ వాళ్ళు కూడా ఇదే ప్రధాన విమర్శనాస్త్రంగా సంధిస్తున్నారు. మరి ఒకవేళ టీడీపీ జనసేన మద్య పొత్తు కుదిరితే సి‌ఎం అభ్యర్థి ఎవరో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పవన్ నిప్పులు.. వైసీపీ చురకలు !

29న బీఆర్ఎస్‌పీపీ సమావేశం..

విస్తరిస్తోన్న బి‌ఆర్‌ఎస్.. ఆ పార్టీలకు ముప్పే!

- Advertisement -