మెడికల్ షాపుల బంద్..

4
- Advertisement -

మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్లైన్ ఫార్మసీలపై యుద్ధానికి సిద్ధమయ్యారు మెడికల్ షాప్ యజమానులు.

నకిలీ మందులు, గడువు ముగిసిన టాబ్లెట్లు, నియంత్రణ లేకుండా అమ్మకాలపై తీవ్ర ఆందోళన చేయగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫార్మసీ సంఘాల హెచ్చరిక జారీ చేశాయి.

కోవిడ్ కాలంలో ఇచ్చిన వెసులుబాట్లను అడ్డంగా పెట్టుకుని భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలురాగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకర మందులు ఆన్లైన్‌లో సరఫరా అవుతున్నాయంటూ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ మందుల దందా మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:‘వే ప్రొటీన్’..ప్రత్యేకత ఇదే!

లైసెన్స్ ఉన్న మెడికల్ షాపులపై కఠిన నిబంధనలు… ఆన్లైన్ కంపెనీలకు మాత్రం స్వేచ్ఛ… చిన్న మెడికల్ షాపుల జీవనోపాధి దెబ్బతింటోందంటూ వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల విక్రయాలను పూర్తిగా నియంత్రించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేయగా రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా మెడికల్ షాపులు బంద్‌లో విజయవంతం చేయాలి అని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా తెలిపారు.

- Advertisement -