మెడికల్ ఫీల్డ్ అంటే డైలీ అప్‌డేట్‌: హరీశ్‌రావు

83
harishrao
- Advertisement -

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది డైలీ అప్‌డేట్‌ కావాలన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 30 టీచింగ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హారీశ్‌ రావు మాట్లాడుతూ… ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్‌ను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కు 3 టైర్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఆస్పత్రిలో ఒక 3 మెన్ కమిటీ ఉంటుందని..ఈ కమిటీ మీటింగ్ ప్రతి సోమవారం ఉంటుందని తెలిపారు. 30 టీచింగ్ హాస్పిటల్స్కు రెండు రోజుల ట్రైనింగ్ ఉంటుందని.. దీనికి ఎవరు మిస్ కావొద్దని సూచించారు. ప్రతి రెండేళ్లకు ఓసారి ఇలాంటి ట్రైనింగ్ పెట్టమని అధికారులకు సూచించినట్లు హరీష్ రావు చెప్పారు.

ఆపరేషన్ థియేటర్స్, డయాలసిస్ వార్డ్స్, లేబర్ రూమ్స్లలో ఇన్ఫెక్షన్ ఉంటుందని.. ఇన్ఫెక్షన్ కంట్రోల్కి వెనకాడొద్దని చెప్పారు. ఆస్పత్రుల్లో ఎక్విప్మెంట్ పాడైతే ఆలస్యం చేయకుండా రిపేర్స్ చేస్తున్నామని తెలిపారు. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ కి ఏడాదికి 20 కోట్లు ఖర్చు అవుతుందన్న ఆయన..గర్భవతుల కోసం 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ మిషన్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.

అంతిమంగా మాకు కావాల్సింది ప్రజలకు అత్యుత్తమ సేవలు. ఆ సేవలకు కొలమానం ప్రజల నుంచి సంతృప్తి… అస్పత్రికి వచ్చే రోగులకుఉ సంతృప్తికరమైన సేవలు అందించడమే చాలా ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ ఇంఛార్జి డైరెక్టర్‌ రామ్మూర్తి సూపరింటెండ్‌ సత్యనారయణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -