మొక్కలు నాటిన మేడే రాజీవ్ సాగర్

88
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్బంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో గల తన అధికారిక ఆఫీస్ ప్రాంగణం లో మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్.

ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పుడున్న కాలుష్యాన్ని నివారించాలి అంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు.ఒక మొక్కను నాటుతే అది వృక్షం అయి మానవ మనుగడకు ఎన్నో విధాలుగా ఉపయోగ పడతాయి అన్నారు.తెలంగాణ లో హరితహారం గౌరవ ముఖ్యమంత్రి KCR గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ అంతా గ్రీనరి పెరిగే దిశగా పనిచేస్తున్నారు అన్నారు. KCR గారి అడుగుజాడల్లో నడుస్తూ సంతోష్ కుమార్ గారు రాష్టంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చెపట్టి రేపటి తరాలకు మొక్కలు, వాటి ఆవష్యకతను తెలియచేస్తూ కృషి చేస్తున్నారు అన్నారు. ఇంతటి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -