జనసంద్రంగా మారిన మేడారం

650
medaram
- Advertisement -

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్కల జాతర. అమ్మవార్లను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఫిబ్రవరి 5నుంచి 8 వరకు ఈ జాతర జరుగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మేడారంలో రాత్రి సమయంలో తీసిన డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. మేడారం చుట్టప్రక్కల మొత్తం లైట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాలతో పటిష్ట భద్రతలను ఏర్పాటు చేశారు అధికారులు. రెండేళ్ళకోమారు జరిగే ఈ జాతరకు ఈ దఫా కోటి మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

medaram 2

మరోవైపు రేపట్నుంచి మేడారం జాతర ప్రారంభంకానుంది. దీంతో మేడారం ప్రాంతం మొత్తం జనసంద్రోహంగా మారింది. ఆ ప్రాంగణమంతా భక్త కోలాహలం నెలకొంది. అటు.. పెళ్లి కొడుకు పగిడిద్దరాజును సమీప బర్లగుట్టపై నుంచి సోమవారం ఉదయం గుడికి తరలించారు. పగిడిద్ద రాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు చేశారు. అక్కడి నుంచి తొట్టివాగు వద్ద ఉన్న గద్దెల వద్దకు పగిడిద్దరాజును తీసుకెళ్లి గద్దెలపై నిలిపి సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పగిడిద్ద రాజు పడగలతో డోలీల చప్పుల్లతో కాలి నడకన మేడారానికి బయలుదేరారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 7న సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్కించుకోనున్నారు.

- Advertisement -