మేడారం జాతర.. 30 ఏళ్ల తర్వాత ప్రారంభమైన ఈ అనవాయితి..

161
- Advertisement -

తెలంగాణ మహా జాతర సమ్మక్క సారలమ్మ ల మేడారం జాతరకు అడవిలో నుండి అమ్మవాలని ఎదుర్కొని తేవడానికి అవసరమైనా వెదురు బుట్టలు తయారీ పూజ మహోత్సవం దిల్ సుఖ్ నగర్ శాలివాహన నగర్‌లో నిర్వహించారు. సుమారు 30 సంవత్సరాలుగా నిలిచిన అనవాయితిని ఈ యేడు తిరిగి ప్రారంభించారు. శాలివాహన నగర్‌లో మేదర కులస్తులైన పిల్లి మహేందర్ కుమార్ నివాసంలో బుట్టల తయారీ కార్యక్రమం మొదలు చేశారు. మేడారం పూజారి జనకమ్మలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

సమ్మక్క జాతరని నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని మేడారంలోని గద్దె మీద నిలబెడతారు. రెండో రోజు చిలకలగుట్టలో, భరిస్ణె రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు. మూడో రోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద ఉండి భక్తులకి దర్శనమిస్తారు. నాలుగో రోజు సమ్మక్క సారక్కలను గద్దె మీదకు దించడంతో జాతర పూర్తవుతుంది.

- Advertisement -