నేటి నుంచి మహాజాతర ప్రారంభం..

3580
- Advertisement -

వన దేవతలు మేడారం సమ్మక్క సారలమ్మల జాతర నేటి నుంచి ప్రారంభం ప్రారంభమైంది. నేటి నుంచి 19వ తేది వరకు ఈ జాతర జరుగనుంది. ఇవాళ మేడారానికి పగిడిద్దరాజు రానున్నారు. డప్పుచప్పుల్లు, నృత్యాలు, శివసత్తులతో మేడారం ప్రాంతం మొత్తం సందడిగా మారనుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సారలమ్మ , రేపు మధ్యామ్నం సమ్మక్క గద్దెపైకి రానున్నారు.

మేడారం జాతర చివరి ఘట్టానికి చేరుకోవడంతో జనంసంద్రోహంతో కిటకిటలాడుతుంది. జాతరలో భాగంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాలతో పటిష్ట భద్రతలను ఏర్పాటు చేశారు అధికారులు. రెండేళ్ళకోమారు జరిగే ఈ జాతరకు ఈ దఫా కోటి మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా ఈనెల 18న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం అమ్మవార్లను దర్శించుకోనున్నారు.

- Advertisement -