మేడారంకు జాతీయ హోదా..కేంద్రమంత్రి ఆశాభావం

496
arjun munda
- Advertisement -

మేడారం సమ్మక్కను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి అర్జున్ ముండా. వనదేవతలను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున మేడారాన్ని జాతీయ పండగగా ప్రకటించాలని విన్నవించారని….ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జాతీయ గిరిజన పండగ కల సహకరం అవుతోందని ఆశీస్తున్నానని చెప్పారు.

జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారు…త్వరలో నే గిరిజన ఆదివాసుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నా అన్నారు. గిరిజన నుల వద్ద ఆస్తులు లేకున్నా …. ఆనందం ఉందన్నారు. మరోసారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు.

ఇప్పటివరకు 12 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్ధానాలకు తరలించామన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌. జాతరకు ఇప్పటివరకు 30 వేల ట్రిప్పులు బస్సులు నడిపించామన్నారు.

- Advertisement -