మ‌రో రికార్డు సొంతం చేసుకున్న మ‌హాన‌టి..

85
Mahanati box office collection Dream run for Keerthy Suresh in USA

టాలీవుడ్ చ‌రిత్ర‌లో తొలిసారిగా ఓ న‌టి బ‌యోపిక్ ను తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. అల‌నాటి అందాల తార సావిత్రి జివిత క‌థ ఆథారంగా తెరకెక్కిన మహాన‌టి సినిమా ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకొవ‌డ‌మే కాకుండా..బాక్సాఫిస్ లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఎటువంటి అంచానాలు లేకుండా విడులైన ఈసినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చింది. అందాల తార సావిత్రి పాత్ర‌లో హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించి ఆపాత్ర‌కు న్యాయం చేసింది.

Mahanati box office collection Dream run for Keerthy Suresh in USA

అచ్చం సావిత్రే మ‌ళ్లీ దిగి వ‌చ్చిన‌ట్టు గుర్తు చేస‌కున్నారు ప్రేక్ష‌కులు. ఈచిత్రం ఇప్ప‌టికే ప‌లు రికార్డుల‌ను సొంతం చేస‌కుంది. విడుద‌లైన తొలి షోనుంచే ప్రేక్షుకులు థీయేర్ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈసినిమాకు ఓవ‌ర్ సిస్ లో కూడా మంచి స్పంద‌న రావ‌డంతో…భారీ కల‌క్ష‌న్ల‌ను రాబ‌డుతోంది.ఇక రీసెంట్ గా మ‌హాన‌టి చిత్రం మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. మే9న విడుద‌లైన ఈమూవీ ఓవ‌ర్ సీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు మిలియ‌న్ డాలర్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఓవ‌ర్ సీస్ లో ఇప్ప‌టికి హౌస్ పుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది.

Mahanati box office collection Dream run for Keerthy Suresh in USA

ఇలాగే ఇంకా కొన్ని రోజులు న‌డిస్తే మ‌రిన్ని రికార్డులు సొంతం చేసుకొవ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఈమూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..వైజ‌యంతి మూవీస్, స్వ‌ప్నా సినిమా సంస్ధ‌లు సంయుక్తంగా నిర్మించాయి. మ‌హాన‌టిలో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌గా జెమిని గ‌ణేష్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య‌, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, రాజేంద్ర ప్ర‌సాద్ ప‌లువురు న‌టీన‌టులు ఈసినిమాలో న‌టించారు.