అతిలోక సుందరి శ్రీదేవితో ఎక్కవ సినిమాలలో నటించిన హీరో ఎవరంటే వెంటనే కమల్ హాసన్ పేరు గుర్తొస్తుంది. ఈ ఇద్దరు కలిసి 21 సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు మోస్ట్ హిట్ పెయిర్‌గా కూడా ఈ ఇద్దరికి పేరు ఉంది. ఈ నేపథ్యంలో శ్రీదేవితో కమల్‌కు సంబంధాలను అంటగడుతూ తమిళ మీడియాలో కథనాలు వెలువడడం పట్ల కమలహాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి సరైనది కాదని ఆయన హితవు పలికారు.
తెరమీద మా కెమిస్ట్రీ బాగా పండినప్పటికీ.. బయట మాత్రం అన్నాచెల్లెలు లాగా ఉండేవాళ్లమని కమల్ అన్నారు. అప్పట్లో తమ జోడిలా ఉంటాలంటూ చాలామంది ఉదాహరణగా చెప్పేవారని.. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న అన్నాచెల్లెలు అనుబంధం గురించి ఎవరికీ తెలీదని చెప్పారు. తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్‌కు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
మహిళా ఓటర్లను ఆకర్షించడానికి తమిళనాడు రాజకీయ పార్టీలు మద్య నిషేదం అనే పేకాటను ఆడుతున్నాయి. మొత్తం సమాజాన్ని మద్యానికి దూరం చేయడం సాధ్యం కాదు. మద్యపానం అనేది జూదం కాదు. దాన్ని తక్షణమే ఆపేయలేం. అయితే రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాను. మద్యపానాన్ని ఆపలేం. కానీ మనం దాన్ని నివారించొచ్చు’ అని కమల్ హాసన్ తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు.