ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌కే..

22
- Advertisement -

ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌కే దక్కింది. ఇవాళ జరిగిన పోలింగ్‌లో ఢిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ బీజేపీ అభ్యర్థిపై 36 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఢిల్లీ మున్సిప‌ల్ హౌజ్‌లో జ‌రిగిన స‌మావేశంలో బీజేపీకి 116 ఓట్లు పోల‌వ్వ‌గా ఆప్‌కు 150 ఓట్లు ప‌డ్డాయి.

ఎంపీల తర్వాత కొత్త‌గా ఎన్నికైన కౌన్సిల‌ర్లు ఓటు వేశారు. ముందుగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు ఓటేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున షెల్లీ ఒబ్రాయ్‌, ఆశూ థాకూర్‌లు ఆప్ మేయ‌ర్ అభ్య‌ర్ధులుగా పోటీప‌డ్డారు. ఇక బీజేపీ త‌రపున రేఖా గుప్తా పోటీలో నిలిచారు.

నామినేటెడ్ స‌భ్యులు ఓటు వేయ‌రాదు అని షెల్లీ ఒబ్రాయ్ సుప్రీంలో కేసు వేసిన విష‌యం తెలిసిందే. నామినేటెడ్ స‌భ్యులకు ఓటు హ‌క్కు లేద‌ని సీజేఐ డీవై చంద్ర‌చూడ్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు.

250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాల్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలిచింది. బీజేపీ 113 సీట్లు కైవ‌సం చేసుకున్న‌ది. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ ప‌ట్టుకోల్పోయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -