నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ 16న వరంగల్‌లో ప్రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎంసీఏ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. అదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఇంట్లో వదినదే పెత్తనం. మరిది గారేమో.. జస్ట్ పని మనిషి టైపన్నమాట. వదినపై ఫస్ట్రేషన్. ఏం చేయాలో తెలీక పిన్నితో మొర పెట్టుకుంటుంటాడు. చివరికి ఆ వదినకే ఓ సమస్య వస్తుంది. అప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయి ఏ విధంగా రివైంజ్ తీర్చుకున్నాడన్నది కథ. ట్రైలర్ చూస్తే… కథ సింపుల్‌గా అర్థమైపోతోంది.
ఇందులో పెద్దగా మెరుపులేం లేవు గానీ, నాని ఎప్పట్లా తన సహజసిద్ధమైన నటనతో డైలాగుల్ని వల్లించి… రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. సాయి పల్లవిని ట్రైలర్‌లో సరిగా చూపించలేదేమో అనిపిస్తోంది. మిడికల్ క్లాస్ ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మొత్తానికి మిడిల్‌క్లాస్ అబ్బాయి ఆకట్టుకొనేలానే ఉన్నాడు.