జనవరి 26న…అభిమన్యుడు

246
Vishal in Abhimanyudu
- Advertisement -

పందెం కోడి నుంచి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌. ప్రస్తుతం డిటెక్టివ్‌ పెద్ద హిట్‌ అయిన ఆనందంలో ఉన్న విశాల్ త్వరలో  డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. విశాల్‌, సమంత జంటగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి ‘అభిమన్యుడు’ టైటిల్‌ని ఖరారు చేశారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత హరి గుజ్జలపూడి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Vishal in Abhimanyudu
ఈ సినిమాలో అర్జున్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్‌గా.. ప్రెజెంట్ చేశారు.  ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌ని చూస్తే.. ఇదో మైండ్ గేమ్ బేస్‌డ్ మూవీలా అనిపిస్తోంది. టెక్నీక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఈ సినిమా ఉండొచ్చ‌నిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 26న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత ద‌ర్శ‌కుడు.  సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి.

- Advertisement -