- Advertisement -
టీఆర్ఎస్ నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు మరింత భద్రత కల్పిస్తాను అని.. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూరమైన వెళ్తాను అని.. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తాను అని ఆమె పేర్కొన్నారు. మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని విజయలక్ష్మి తెలిపారు.
- Advertisement -