క్యాన్సర్ వ్యాధి రాకుండా నగర ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. మహిళలందరికి క్యాన్సర్ ముందస్తు చెకింగ్ సదుపాయంతో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. పది పదిహేళ్లకిందట క్యాన్యర్ వ్యాధి అంతాగా వ్యాప్తి చెందలేదు. గత నాలుగేళ్లుగా ఈ వ్యాధి తీవ్రత మరింగా పెరిగింది.
ప్రతి నాలుగు ఇండ్లలో ఒకరికి కేన్సర్ వ్యాధి ఉంది. రొమ్ము క్యాన్సర్ తో దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షమంది మరణిస్తున్నారని చెప్పారు. మమ్మోగ్రఫీ పరీక్ష ద్వారా కేన్సర్ ను గుర్తించి జాగ్రత్తగా ఉండొచ్చన్నారు. జిహెచ్ ఎమ్ సి పారిశుధ్య సిబ్బందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు జపాన్ కు చెందిన వైద్య సంస్థ ముందుకు వచ్చిందన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి ఈపరిక్షలు చేస్తామని చెప్పారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత మానసికంగా.. ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా అందరూ పరీక్షలు చేయించుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు.