రాబోయే 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు పలు పార్టీల నేతలు. భారతీయ జనతా పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా విశ్వ ప్రయత్నాల్లో మునిగిపోయారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రానున్న ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీతో తాము కలిసి పనిచేయాలనుకుంటున్నామని ఆమె ప్రకటించారు.
యూపీలో సీఎం యోగీ ఆదిత్యానాథ్ సొంత నియోజవర్గం గోరఖ్‌పూర్, పుల్‌పూర్ జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్సీ- బీఎస్పీ కూటమిగా పోటీచేసి బీజేపీ ఓటమి రుచి చూపించిన విషయం తెలిసిందే. ఇక రానున్నఎన్నికల్లో మతతత్వ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను మట్టికరిపించేదుంకు లౌకిక శక్తులన్ని ఏకం కావాల్సిన సమయం వచ్చిందని మయావతి తెలిపారు.
ఇక సీట్ల పంపకాల విషయంలో ఎస్పీ అధినేత అఖిలేష్‌తో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుని ఎస్పీ-బీఎస్పీ కూటమిగా పోటీచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తామన్నారు. త్వరలో జరుగనున్న కైరానా, నూర్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మొత్తానికి ఎన్నికలు ఏవైనా బీజేపీని అధికారంలో రాకుండా ఎదుర్కోనేందుకు మాయావతి స్కేచ్ పనిచేస్తుందో లేదో చూడాలి.