అయోధ్యలోని రామ్ మందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి మరియు ఆందోళనకరమైనవి అని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆమె హెచ్చరించారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరినీ వదిలిపెట్టకూడదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
అయోధ్య రామ్ మందిరంలో విరాళాల దొంగతనంపై అయోధ్య పోలీసులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అన్నారు.
రామ్ మందిరంలో భక్తులు సమర్పించే కానుకల విషయంలో భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు… దేశంలోని ఇతర ప్రముఖ దేవాలయాలు అనుసరిస్తున్న తరహాలోనే ఇక్కడ కూడా ఒక అకౌంటింగ్ (ఆర్థిక నిర్వహణ) వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మాయావతి సూచించారు.
రాజకీయాలు, నేరాలు మరియు మతాన్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టవద్దని హెచ్చరిస్తూ.. రాజకీయాలను నేరమయం చేయడం, నేరాలను రాజకీయం చేయడం, మతాన్ని రాజకీయం చేయడం మరియు రాజకీయాలను గుడ్డిగా మతమయం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇది రాజ్యాంగానికి లోబడి మరియు సరైన పద్ధతిగా ఉంటుంది. దేశ ప్రయోజనాలు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ పార్టీలకు బీఎస్‌పీ ఇచ్చే సలహా ఇదే, అలాగే దేశ ప్రజలకు నా విజ్ఞప్తి కూడా ఇదే అని ఆమె అన్నారు.
Also Read:ట్రెండింగ్‌లో ‘ఇరుముడి’ సాంగ్
ఈ కేసులో విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని ఇప్పటివరకు అరెస్టయ్యి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఆలయ నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

