దిలీప్, ఇషా జంటగా గ్రీష్మా ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘మాయామాల్’. గోవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ నెల 21న విడుదల కానుండడంతో ఈ చిత్ర యూనిట్ నారా రోహిత్ చేతుల మీదుగా ఆడియో సీడీని ఆవిష్కకరింపచేసి ప్రీ రిలీజ్ వేడుకను ప్రసాద్ ల్యాబ్ నందు నిర్వహించుకున్నారు.
ఈ సందర్బంగా అతిథిగా విచ్చేసిన నారా రోహిత్ మాట్లాడుతూ.. “హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన ప్రతీ చిత్రం విజయం సాధించాయి. అలానే ఈ మాయామాల్ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఈ చిత్రంతో మొదటిసారి నిర్మాతగా మారిన హరికి ఈ చిత్ర యూనిట్ కు నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా” అన్నారు. అనంతరం మాయామాల్ .సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. “‘రాజుగారి గది’ లాంటి హారర్ కామెడీ చిత్రం తరువాత చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఉన్న ఒకే ఒక్క పాటకు కూడా మంచి పేరు వచ్చింది. ఇక రీ రికార్డింగ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. దర్శకుడు గోవింద్ చాలా బాగా తీసాడు. నిర్మాత హరి ఈ చిత్రాన్ని క్వాలిటీ తో తెరకెక్కించారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు” అన్నారు.
నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ.. “సాయికార్తీక్ నాకు చాలా మంచి మిత్రుడు ఈయన వల్లే సినిమా చేయగలిగాను, సినిమా అయితే చాలా క్వాలిటీ గా తీయగలిగాను కానీ విడుదల చేయడానికి చాలా భయపడ్డాను కానీ సాయికార్తిక్, జీవన్ కుమార్ ల ప్రోత్సాహం తో ఇంతవరకు వచ్చాము, వెరీ గుడ్ మూవీ ఇది. సాయి కార్తీక్ రీ రికార్డింగ్ అయితే వణుకు పుట్టించింది. చాలా ప్యాషనేట్ తో చిత్రాన్ని నిర్మించాను, నా సినిమాను నేను చూసుకుంటుంటే లవబుల్ గా అనిపించింది, ఒక రాత్రి మొత్తం జరిగే హారర్ కామెడీ మూవీ ఇది” అన్నారు. సినిమా బాగా వచ్చింది, హరి సహకరించి ప్రోత్సహించక పోతే ఈ చిత్రం ఇంతబాగా వచ్చేది కాదు, నటీనటులకు టెక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు ఈ చిత్ర దర్శకుడు గోపాల్.
హీరో దిలీప్ మాట్లాడుతూ.. “ఇనార్బిట్ మాల్, మంజీర మాల్ ఇలా హైదరబాద్ లోని ప్రతి మాల్ లో నైట్ షూట్ చేసాము, ఔట్ పుట్ చాలా బాగొచ్చింది, రీ రికార్డింగ్ కు ప్రాణం పోశారు సాయి కార్తీక్, కెమెరా వర్క్ కు అయితే అవార్డ్ ఖచ్చితంగా వస్తుంది, నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు” అన్నారు.
హీరోయిన్ ఇషా మాట్లాడుతూ.. “నైట్ షూట్ కనుక చాలా కష్టపడి పనిచేసాము, ఒక హారర్ చిత్రానికి ముఖ్యంగా కావాల్సింది డీఓపీ అతను చాలా క్వాలిటీ నిఇచ్చాడు ఈ చిత్రానికి నా తోటి నటీనటులందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా” అన్నారు.
ఈ కార్యక్రమంలో మరో హీరోయిన్ లు సోనియా, దీక్షాపంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జీవన్ కుమార్, తాగుబోతు రమేశ్, కొరియోగ్రాఫర్ సతీష్ తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలను, విషెస్ లను తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.