- Advertisement -
మే 23…2019 దేశ రాజకీయాల్లో మర్చిపోలేని రోజు. కేంద్రంలో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టగా ఏపీలో జగన్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఇక మే 23కి ఎంతో ప్రత్యేకత ఉంది. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి వర్దంతి ఇవాళే. తాతకు ప్రేమతో అని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
సేమ్ టైమ్ చంద్రబాబును తూర్పారబడుతున్నారు. బాబుకు పసుపురాసి జగన్‌కు కుంకుమ పెట్టారని(పసుపు కుంకుమ)పథకంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ రోజు మరవలేనిది. ఆయనకు విజయం, పుట్టిన రోజు కలిసి వచ్చాయి.
ఇక చంద్రబాబు,హిట్టర్‌కు మరో ప్రత్యేకత ఉంది. వీరిద్దరు ఏప్రిల్ 20న పుట్టగా రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పతనం మే 23న మొదలైంది. టీడీపీకి కూడా మే 23న వెలువడే ఫలితాలతో ఇంటికెళ్లిపోయింది.
- Advertisement -