పెళ్లిళ్ల సీజన్..ఒక్క ‘మే’ నెలలోనే!

14
- Advertisement -

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఒక్క మే నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. చైత్రమాసం తర్వాత వచ్చే మాసమే వైశాఖ మాసం. తెలుగు సంవత్సరం లో రెండవ నెల. చంద్రుడు ఈ మాసంలో విశాఖ నక్షత్రంతో ఉంటాడు కనుక ఈ నెలకు వైశాఖ మాసం అని పేరు.

కాబ‌ట్టి పెళ్లి ముహూర్తాల కోసం ఎదురుచూసే వారి కల నెరవేరే టైం వచ్చేసింది. ఈ నేపథ్యంలో మే నెల శుభ వివాహ ముహుర్తాన్ని గమనిస్తే.. మే 1, గురువారం : ఉదయం 11:23 నుండి మధ్యాహ్నం 02:21 వరకు మంచి ముహుర్తం ఉంది. మే 5, సోమవారం : రాత్రి 8:28 నుండి మరుసటి రోజు ఉదయం 5:54 వరకు, మే 6, మంగళవారం : ఉదయం 5:54 నుండి మధ్యాహ్నం 3:51 వరకు మంచి టైం ఉంది.

మే 8, గురువారం : మధ్యాహ్నం 12:28 నుండి ఉదయం 5:52 వరకు, మే 9, శుక్రవారం : ఉదయం 5:52 నుండి మధ్యాహ్నం 12:08 వరకు, మే 10, శనివారం : ఉదయం 3:15 నుండి మరుసటి రోజు ఉదయం 4:01 వరకు, మే 14, బుధవారం : ఉదయం 6:34 నుండి 11:46 వరకు,మే 15, గురువారం : ఉదయం 4:02 నుండి మరుసటి రోజు ఉదయం 5:26 వరకు,మే 16, శుక్ర‌వారం : ఉదయం 5:49 నుండి సాయంత్రం 4:07 వరకు,మే 17, శనివారం : సాయంత్రం 5:43 నుండి మరుసటి రోజు ఉదయం 5:48 వరకు,మే 18, ఆదివారం : సాయంత్రం 5:48 నుండి 6:52 వరకు, మే 22, గురువారం : మధ్యాహ్నం 1:11 నుండి ఉదయం 5:46 వరకు,మే 23, శుక్రవారం : ఉదయం 5:46 నుండి మరుసటి రోజు ఉదయం 5:46 వరకు,మే 24, శనివారం : ఉదయం 5:22 నుండి ఉదయం 8:22 వరకు,మే 27, మంగళవారం : సాయంత్రం 6:44 నుండి మరుసటి రోజు ఉదయం 5:45 వరకు,మే 28, బుధవారం : ఉదయం 5:45 నుండి సాయంత్రం 7:08 వరకు మంచి ముహుర్తాలున్నాయి.

Also Read:శ్రామికుల త్యాగం వెలకట్టలేనిది!

- Advertisement -