మే నెల..బ్యాంకు సెలవులు ఎన్నిరోజులో తెలుసా?

58
- Advertisement -

మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉండనుంది. దేశంలో వివిధ పండుగలు, పర్వదినాలు, ఇతర కారణాల దృష్ట్యా బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. మే నెలలో 12 రోజులు సెలవులు ఉండనుండగా వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా మే1వ తేదీ దేశ వ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటారు. కనుక మేడేతో ఈ నెల ప్రారంభం అవుతోంది.

మే1వ తేదీన మేడే.. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కత్తా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలో సెలవులు ఉంటాయి. మే2వ తేదీన మున్సిపల్ ఎన్నికల కారణంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే5వ తేదీన బుద్ధ పౌర్ణమి సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్ కత్తా, ముంబై, నాగాపూర్, న్యూఢిల్లీ, రాయ్ పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

Also Read:పేదప్రజల కోసమే తొలి సంతకం..

మే9వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని కోల్ కత్తాలో సెలవు ఉంటుంది. మే13వ తేదీన రెండో శనివారం,మే16వ తేదీన సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాంగ్ టక్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు.

Also Read:కొత్త సచివాలయం… ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే?

- Advertisement -