వైసీపీనే టార్గెట్..బాలయ్యతో బోయపాటి!

31
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడమే. తెలుగులో అలాంటి విజయవంతమైన కాంబినేషన్ బాలకృష్ణ- బోయపాటి. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా మాస్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనరే. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయలను సాధించాయి. ఇక వీరిద్దరి కాంబో గురించి ఏ అప్‌డేట్ వచ్చిన అది వైరల్ న్యూసే.

తాజాగా వీరిద్దరి కాంబో మళ్లీ రాబోతుందట. ఏపీ రాజకీయ క్షేత్రంలో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ- టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. రోజు మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ పెరిగిపోగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాలకృష్ణతో బోయపాటి శ్రీనివాస్ కర్టెన్ రైజర్ చేయడానికి సిద్ధమయ్యారు.

Also Read:కొత్త సచివాలయం… ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే?

వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా అండర్ కరెంట్ ఉండే సినిమాని బాలకృష్ణ చేయనున్నారు. NBK108 తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బోయపాటితో చేయనున్నారు బాలయ్య. ఈ ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ సంస్ధ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను కూడా పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. ముఖ్యంగా టీడీపీ పార్టీ పబ్లిసిటీ కోసం బోయపాటితో పాటు రాజమౌళి కూడా కొన్ని చిన్న సినిమాలు చేస్తారనే టాక్ నడుస్తోంది. మరి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి బాలయ్య చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Also Read:CM KCR:తెలంగాణ..ప్రగతి వెలుగుల దారి

- Advertisement -