ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే…!

156
hotstar
- Advertisement -

థియేటర్లతో పోటీగా ఓటీటీలో సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే ఓటీటీ సినిమాలెంటో తెలుసుకుందాం..రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం ఈ నెల 20న ఓటీటీ లో రిలీజవుతోంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా, సోనాక్షి హీరోయిన్‌గా నటిస్తున్న దగడ్ సాంబ సైతం ఈ నెల 20నే విడుదల కానుంది.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య మూవీ థియేటర్లో రిలీజైంది. అయితే మెగా అభిమానులకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ నెల 20న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా వస్తున్న భూల్ భులాయా 2 ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటస్తోంది.యువ నటుడు శ్రీ విష్ణు హీరోగా దంతలూరి డైరెక్షన్ రూపొందిన భళా తందనాన చిత్రం ఈ నెల 20న ఓటీటీలో సందడి చేయనుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 12th మ్యాన్ మూవీ ఈ నెల 20న ఓటీటీలో విడుదల కానుంది. వీటితో పాటు మే 18న వూ కిల్డ్ సారా ( వెబ్ సిరీస్ 3 ) ( మే 18 ),20న జోంబ్లవీ,కన్నడలో హనీమూన్ కూడా 20నే రిలీజ్ కానుంది.

- Advertisement -