సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’.
ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: ప్చ్.. కంగనా ఇంకెప్పటికీ మారుతుందో !
శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్.
Also Read: ‘ఎన్టీఆర్ 30’కి అతని కొట్టుడు నచ్చట్లేదు