వైలోప్పిల్లీ…కేరళ సాహిత్యాభ్యుదయ రచయిత

39
- Advertisement -

అతొనక భావ కవిత సంకలనల రచయిత. తన రచనలు ఎలా ఉంటాయంటే చారిత్రక మూలాలపై శాస్త్రీయ అంతర్‌దృష్టి మరియు మానవ మనస్సు యొక్క మానసిక అంతర్ ప్రవహాల లోతైన అవగాహనను అతని కవిత్వంలో కనిపిస్తుంది. అతనెవరో కాదు వైలోప్పిల్లి శ్రీధర్ మీనన్‌. ఈయన మే 11, 1911న ఎర్నాకులంలోని కలూర్‌లో జన్మించారు. ఈయన శ్రీ అనే కలం పేరుతో తన కవిత్వాలను రాయడం మొదలుపెట్టారు.

1947లో తన మొదటి కవితా సంకలనం అయిన కన్నిక్కోయ్తు (ది మైడెన్ హార్వెస్ట్) విడుదలైంది. ఇలా తన కలం పేరుతో మలయాళంలో రొమాంటిక్ కవితలనే కాకుండా ఆధునిక యుగానికి చెందిన పరివర్తనతో కూడిన కవిత్వాలను కూడా రచించారు. మలయాళ సాహిత్యంలో భారతీయ కవి కుడియోజిక్కల్ కన్నిక్కోయ్తు, మాంబజం వంటి రచనలు ప్రసిద్ది చెందాయి.

మీనన్ పద్యాలు నాటకాలు జీవిత చరిత్రలతో కలిపి మొత్తం 20 పుస్తకాలను ప్రచురించారు. వైలోప్పిల్లి శ్రీధర్ మీనన్ 1964లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును గెలుచుకున్నారు. అదే సంవత్సరం కేరళ సాహిత్య అకాడమీ అవార్డును తన కవితా సంకలనమైన కైపవల్లరికి దక్కింది. ఒడక్కుఝుల్ అవార్డును గెలుచుకున్నారు. మకరకోయత్తు సంకలనంకు 1981లో వాయలర్ అవార్డును గెలుచుకుంది.

Also Read: ఢిల్లీ పాలన స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీం

మీనన్ పదవీ విరమణ సమయంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ స్కూల్‌ను వైలోప్పిలి శ్రీధర్ మీనన్ మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ అని పేరు మార్చారు. అంతేకాదు తిరువనంతపురంలో ఉన్న నంతన్‌కోడ్‌లో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం బ్లాక్‌తో కూడిన బహుళ ప్రయోజన సాంస్కృతిక సముదాయాన్ని నిర్మించింది. ఈ సముదాయానికి ఆయన గౌరవార్థం వైలోప్పిల్లి సంస్కృతి భవన్ అని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ పేరు పెట్టారు. ఈ మ్యూజియంలో మీనన్‌ వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. మీనన్ గౌరవార్థం కేరళ ప్రభుత్వం వార్షిక సాహిత్య పురస్కారం వైలోప్పిల్లి కవితా పురస్కారంను కవులకు అందిస్తున్నారు.

Also Read: మే 16.. దోస్త్ ఆప్లికేషన్‌ షూర్

- Advertisement -