ఐపీఎల్ 2021: ఆర్‌సీబీ స్కోర్‌ 204‌

232
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్ లో విజయాల బాటలో పయనిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. విధ్వంసక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరవిహారం చేయడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. డివిలియర్స్ 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అంతకుముందు, 9 పరుగులకే కెప్టెన్ కోహ్లీ (5), పాటిదార్ (1) వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టును మ్యాక్స్ వెల్ ఆదుకున్నాడు. మ్యాక్స్ వెల్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు సాధించాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 25 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి. పాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.

- Advertisement -