బీజేపీ మొదటి నుంచి కూడా మతపరమైన పార్టీ అనే సంగతి అందరికీ తెలిసిందే. హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ఇతర మతాలను కించపరిచేలా కమలనాథులు చాలసందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే హిందూ దర్మాన్ని ప్రోత్సహించడంలో తప్పులేదు గాని.. దేశంలో హిందూ మతం ఒక్కటే ఉండాలని కోరుకోవడం సరైన విధానం కాదని కొందరి విశ్లేషకుల వాదన. భారతదేశం సర్వమతాల సమ్మేళనం.. అన్నీ మతాల వారికి రాజ్యాంగం సమానత కల్పించింది. అయినప్పటికీ చాలా సందర్భాల్లో కమలనాథులు ఇతర మాటలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు కోకొల్లలు.
తెలంగాణ విషయానికొస్తే బీజేపీ చీఫ్ బండి సంజయ్ తరచూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతూవుంటాడు. గతంలో హైదరాబాద్ లో ఉన్న ముస్లింలపై సర్జికల్స్ స్ట్రైక్స్ చేయాలని, మసీదులను కుల్చాలని ఇలా ఎన్నో రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. ఇలా మతాలను వేరుపరిచి అల్లర్లు సృష్టించే విధంగా వ్యాఖ్యానించడం ఏంటని బండి సంజయ్ పై ప్రతి సామాన్యుడి నుంచి కూడా విమర్శలు వినిపించాయి. ఇక మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యాలే చేశారు బండి సంజయ్. రజాకార్ల పాలనను తరిమికొట్టి రాజారాజ్యం తీసుకోస్తానని చెప్తునే.. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని ఉపయోగించనని అన్నారు.
అయితే గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో మతవిద్వేషాలు ఖచ్చితంగా రెచ్చగొడతామని మసీదులు కూల్చుతమని చేసిన వ్యాఖ్యలు విధితమే. అయితే ఇలా హిందువులను మాత్రమే హక్కున చేర్చుకొని ఇతర మతాలను ధూషించడం వెనుక బీజేపీ మొదటి నుంచి కూడా ఒక వ్యూహాన్ని అమలు చేస్తోందనేది కొందరి వాదన.. దేశంలో అధిక శాతం హిందువులే ఉన్నారు. దాంతో హిందువులను ఆకర్షిస్తే ఎన్నికలు ఏవైనా గెలుపు తథ్యం అనే భావనలో కాషాయ దళం ఉంది.. ఆ విధంగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోతోందనేది.. బీజేపీని విమర్శించే వారు చెబుతున్నా మాట. అయితే మత విద్వేషాలకు కేటాయించే సమయం దేశంలో సమానత్వం పెంచేందుకు కేటాయిస్తే మేలని సామాజిక వాదులు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా బీజేపీ మతపరమైన విధానాలను పక్కన పెట్టి దేశంలో సమానాత్వానికి కృషి చేతుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి…