వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టంపై క్లారిటీ రావాల్సి ఉంది.
భూకంప కేంద్రం జూలియా రాష్ట్రంలోని మెనె గ్రాండే పట్టణానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల దూరంలో (కారకస్ రాజధానికి సుమారు 600 కిలోమీటర్ల దూరం) నమోదైంది. భూకంపం 7.8 కిలోమీటర్ల లోతులో నమోదైందని USGS తెలిపింది.
భూకంపం సంభవించిన సమయంలోనూ, తరువాతనూ రాష్ట్ర టెలివిజన్ తన కార్యక్రమాలను ఆపలేదు. అధ్యక్షుడు నికోలాస్ మడురో నేతృత్వంలో సాగుతున్న విజ్ఞాన సంబంధిత ప్రోగ్రామ్ ప్రసారం కొనసాగింది. మెనే గ్రాండే పట్టణం, వెనిజులా చమురు పరిశ్రమకు కీలకమైన మారకైబో సరస్సు తూర్పు తీరంలో ఉంది. వెనిజులాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయని తెలిసిందే.

Also Read:Asia Cup: ఫైనల్‌కి టీమిండియా

