తెలంగాణపై అర్నబ్ ఎఫెక్ట్

5
- Advertisement -

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అక్టోబర్ 28న వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఆర్నబ్ తుఫాన్ తీర ప్రాంతాల వైపు కదులుతున్న నేపథ్యంలో ఒడిశాలోనూ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని వాణీ విహార్ ప్రాంతంలో కురిసిన జోరు వర్షానికి రహదారులపై నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read:ఆర్నబ్ తుపాన్..ఏపీకి భారీ ముప్పు!

తుఫాన్ ప్రభావంతో ఒడిశాలోని తీర ప్రాంతాల్లోనూ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోనూ వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -