ఆప్ నిరసనలు..ఢిల్లీలో హై అలర్ట్

20
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునివ్వడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోడీ నివాసానికి వెళ్లే అన్ని దారుల్లో బారీగా పోలీసులను మోహరించారు.

ఇక ఆప్ ఆందోళన నేపథ్యంలో మూడు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌పై ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్‌లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వెల్లడించింది.

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 22న అరెస్ట్ చేయగా 6 రోజుల కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఇక ఈ నెల 31న కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనుంది.

Also Read:Gold price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -