- Advertisement -
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఒకేరోజు 145 మంది రాజీనామాలు చేశారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేయగా శుక్రవారం ఒకరోజే 145 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ , హర్యానా పీసీసీ చీఫ్ సునేత్ర చౌదరి, ఢిల్లీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్ కూడా రాజీనామా చేసి రాహుల్ గాంధీకి పంపించారు.
పీసీపీ , ఏఐసీసీ అనుబంధ విభాగాలకు చెందిన పలువురు నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామాలతో ఖాళీలైన పోస్టుల్లో సమర్థులను ఎన్నుకోవాలని రాహుల్‌కు సూచించారు నేతలు.
- Advertisement -