‘మాస్ మాహారాజా’ గారికి కొత్త బిరుదు

31
- Advertisement -

టాలీవుడ్ లో మన స్టార్ హీరోల బిరుదులు భలే విచిత్రంగా ఉంటాయి. పైగా ఒక్కోసారి అవి కామెడీనూ అనిపిస్తాయి. అలాంటి బిరుదులో ఒకటి ‘మాస్ మాహారాజా’… హీరో రవితేజ్ కి ఇచ్చిన బిరుదు ఇది. మరి రవితేజలో అంత గొప్ప మాస్ నెస్ ఏముందో తెలియదు గానీ, మొత్తానికి ఈ బిరుదు మాత్రం రవితేజకి చాలా సంవత్సరాల పాటు ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో గానీ, రవితేజ ఇటీవల తనకున్న ‘మాస్ మాహారాజా’ బిరుదుని తొలగించేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

అసలు ఉన్నట్టు ఉండి ఎందుకయ్యా బిరుదును తొలిగించాలి అంటే.. ‘మాస్ మాహారాజా’ అనే బిరుదులో రవితేజ నటనా చాతుర్యంకి సంబంధించిన పొగడ్త మిస్ అయిందట. మరి మహానటుడు అయ్యే.. ఆయనగారి నటనా కౌసల్యం దెబ్బతింది. అందుకే సడెన్ గా ‘మాస్ మాహారాజా’ తీసేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ బిరుదును మార్చిన ఘనుడు ఎవరయ్యా అంటే.. దర్శకుడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో రవితేజ మరొక మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఈ మూవీలోనే రవితేజ సరికొత్త బిరుదుతోటి కనిపించబోతున్నారు. నలుగురు రైటర్స్ ను పెట్టుకుని.. వారి చేత రాయించుకుని.. తానేదో క్రియేటివ్ జీనియస్ లా బిల్డప్ ఇచ్చే గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడు ఒక బిరుదు ఇవ్వడం, ఇప్పుడు ఆ బిరుదుతోనే తాను ఇక సినిమాలు కంటిన్యూ చేయాలని రవితేజ ఫిక్స్ అవ్వడం నిజంగానే కామెడీగా ఉంది. నిజానికి రవితేజ కామెడీ నటన గొప్పదే, ఆ గొప్పతనాన్ని చాటి చెప్పే బిరుదు ఉంటే మంచిదే. వేరేడే ఏదైనా ఉంటేనే వినడానికే బాగోదు.

Also Read:ఆ కుర్ర దర్శకుడికి ఆమె కావాలట

- Advertisement -