ర‌వితేజ కొత్త చిత్రం ప్రారంభం తేదీ ఖ‌రారు..

292
raviteja
- Advertisement -

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌కత్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈమూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా న‌వంబ‌ర్ 16న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ర‌వితేజకు జోడిగా సీనియ‌ర్ హీరోయిన్ ఇలియాన న‌టించిన త‌మ‌న్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ర‌వితేజ త‌న త‌ర్వాతి చిత్రం దర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి సినిమాల‌కు ఆనంద్ ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ను పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్న‌ట్లు తెలిపారు.

raviteja, vi anand

నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మ‌రో హీరోయిన్ ను కూడా త్వ‌ర‌లోనే ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలిపారు చిత్రబృందం. ఈసినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించేందుకు త‌మిళ స్టార్ బాబీ ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన విష‌యాలు ద‌ర్శ‌కుడు ఆనంద్ ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు. న‌వంబ‌ర్ 13న చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గనుండ‌గా, ఆ రోజు మూవీ టైటిల్ లోగో పోస్ట‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

https://twitter.com/directorvianand/status/1060006406798131200

- Advertisement -