మాస్ మాహరాజ్ రవితేజ, సీనియర్ హీరోయిన్ ఇలియానా జంటగా నటించిన చిత్రం అమర్ అక్బర్ అంటోనీ. ఈచిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు ఈమూవీని నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని ఈనెల 16వ తేదిన విడుదల చేయనున్నారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇటివలే ఈసినిమా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.ఇటివలే శ్రీను వైట్ల తెరకెక్కించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈమూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఇలియాన చాలా రోజుల తర్వాత తెలుగులో హీరోయిన్ గా నటించగా ఆమెకు కూడా ఈమూవీ విజయం చాలా అవసరంగా చెప్పుకోవచ్చు.