ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ తన జీవితకథ ఆధారంగా ప్రియాంక చోప్రా నటించిన బయోపిక్‌పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో విడుదలైన మేరీకోమ్ సినిమాలో తన జీవితంలోని అసలైన కష్టాలు, పోరాటాలను పూర్తిస్థాయిలో చూపించలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేసిన కృషిలో కేవలం 10 శాతం మాత్రమే సినిమాలో చూపించారని వెల్లడించారు. తన నిజమైన ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే అన్‌బ్రేకబుల్ పుస్తకం చదవాలని సూచించారు.
ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందా అని అడిగిన ప్రశ్నకు మేరీకోమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం మరో సినిమా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సీక్వెల్ రావాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. నా కథ గురించి అందరికీ తెలుసు. నా కెరీర్, జీవిత ప్రయాణం ఇప్పటికే సినిమాలోనూ నా అన్‌బ్రేకబుల్ పుస్తకంలోనూ చూపించాను. అయితే బయోపిక్ వాస్తవాలకు పూర్తిగా దగ్గరగా లేదు. కథలో కొన్ని భాగాలు నిజమైనవి కావని నాకు అనిపించింది. నా పోరాటం, కష్టపడి పనిచేసిన తీరులో కేవలం 10 శాతం మాత్రమే సినిమాలో చూపించారు అని ఆమె తెలిపారు.
Also Read:తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?
నా కష్టాలు, పోరాటం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పుస్తకం చదవాలి. నా మిగిలిన జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే భవిష్యత్తు ప్రశాంతంగా, సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమకు చోటు ఉంటుందా అని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. భవిష్యత్తులో అలాంటిది జరిగితే ఆ నిర్ణయం నేనే తీసుకుంటాను అని మేరీకోమ్ పేర్కొన్నారు.
2014లో విడుదలైన ‘మేరీకోమ్’ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆరుగుసార్లు ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో మేరీకోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించారు. ఈ చిత్రంలో నటనకు ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

