బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌లోని రంగులు, ఫ్రేమింగ్, మొత్తం లుక్.. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 పోస్టర్‌ను పోలి ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ రెండు పోస్టర్ల మధ్య పోలికలు యాదృచ్ఛికమా? లేక కాపీ చేశారా? అంటూ ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది.
షారుఖ్ ఖాన్ తన రాబోయే చిత్రం కింగ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆయన నోటితో గులాబీ పువ్వును పట్టుకుని కనిపించారు. సాధారణంగా రొమాంటిక్‌గా అనిపించే ఈ భంగిమలో ఆయన తీవ్రమైన ముఖ కవళికలు పాత్రకు డార్క్ లుక్‌ను తీసుకొచ్చాయి. షారుఖ్ లుక్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కొందరు మాత్రం ఈ పోస్టర్‌ను ధురంధర్ 2 పోస్టర్‌తో పోల్చడం ప్రారంభించారు.
Also Read:తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?
కింగ్ పోస్టర్‌లోని కలర్ గ్రేడింగ్, చిత్ర నిర్మాణం, మొత్తం విజువల్ స్టైల్.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్ 2’ పోస్టర్‌ను గుర్తు చేస్తున్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఓ యూజర్ స్పందిస్తూ.. స్టైల్, ఫైర్, ఫ్రేమ్‌ను కాపీ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఎప్పటికీ ధురంధర్‌లా ఉండలేరు. షారుఖ్ ఖాన్ కింగ్ పోస్టర్ చవకబారు ఏఐతో తయారు చేసిన కంటెంట్‌లా ఉంది అంటూ విమర్శించారు.
మరో నెటిజన్.. కింగ్ పోస్టర్ సాధారణ యాక్షన్ సినిమా టెంప్లేట్‌లా కనిపిస్తోంది. ధురంధర్ మనకు అసలైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చింది. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అలాంటి సినిమా తీసి చూపించండి అంటూ వ్యాఖ్యానించారు.

