‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు

22
- Advertisement -

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

చీర కట్టే వృత్తిని ఎంచుకున్న రాధగా రాజ్ తరుణ్ పాత్రను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. బైక్‌పై అబ్బాయిలా కూర్చోవడాన్ని కూడా ఇష్టపడడు. అయితే, మనీషా కంద్కూర్ అతనిని ఇష్టపడుతుంది. తనతో ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథలో కీలకాంశం.

జె శివసాయి వర్ధన్ ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, రాజ్ తరుణ్‌ని హిలేరియస్ పాత్రలో ప్రజెంట్ చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు రాజ్ ని అభినందించాలి. అతని కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంది. మనీషా కంద్కూర్ కూడా తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ స్నేహితుడిగా హైపర్ ఆది కనిపించాడు. ఇతర ప్రముఖ హాస్యనటుల ప్రజెన్స్ చూస్తుంటే ఈ చిత్రంలో ఎంటర్ టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది.

నగేష్ బనెల్లా కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలవగా, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామెడీ పోర్షన్ ని ఎలివేట్ చేశారు. బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై టీజర్ పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను చాలా బాగా డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. నిర్మాత కిరణ్ గారు కూడా కథ నచ్చి ప్రాజెక్ట్ లో వచ్చారు. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే ఫిల్మ్ అని భావిస్తున్నాను. ఇది మన మధ్యలో జరిగే ఒక కథలా వుంటుంది. మనిషా చాలా చక్కగా నటించింది. శివసాయి చాలా పాషన్ వున్న దర్శకుడు. ప్రతి విషయంలో చాలా క్లియర్ గా పెర్ఫెక్ట్ గా వుంటాడు. శేఖర్ చంద్ర మంచి పాటలు ఇచ్చారు. ఇద్దరు డీవోపీలు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. దాదాపు ఇండస్ట్రీలో వున్న ఆర్టిస్ట్ లందరూ వున్నారు. తమిళ్ నుంచి కూడా వీటీ గణేషన్ లాంటి నటులు తీసుకొచ్చారు. మంచి కంటెంట్ తో రాబోతుంది ఈ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా అవ్వబోతుంది. రెండు రీళ్ళు చూశాను. ఫ్లో చాలా బావుంది. పరిశ్రమలో కి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ నిర్మాతలకు స్వాగతం. చిన్న సినిమాలు ఎప్పటికీ బావుండాలి. నేను ఎంత పెద్ద సినిమాలు చేస్తున్నా .. చిన్నసినిమాతోనే వచ్చాను కాబట్టి ఆ సినిమాలు వదలకుండా ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమా కూడా బాగా ఆడితే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఈటీవీ విన్, ఆదిత్య మ్యూజిక్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ తెలిపారు.

Also Read:ల్యాండ్ టైటిల్ యాక్ట్..నిజానిజాలేంటీ?

- Advertisement -