మామ్ములుగా పెళ్లంటే ఎంతో సందడి,సంతోషం ఉంటుంది. ఇక పెళ్లి తంతు మొదలైనప్పటినుండి ఇల్లంతా చుట్టాలు,స్నేహితులతో కోలాహలంగా ఉంటుంది. పెళ్లిలో అయితే పెళ్లికూతురు,పెళ్లికొడుకు ఫ్రెండ్స్ ఎంతో సరదాగా ఆటపట్టించుకుంటూ ఉంటారు. అయితే అసలు విషయం ఏంటంటే.. కర్ణాటకలోని హుబ్బళిలో ఓ పెళ్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది.. సాధారణంగా పెళ్లిలో పెళ్లి జంటకు స్నేహితులు ఓ కూల్‌డ్రింక్ ఇచ్చి అందులో ఒకే స్ట్రా వేసి తగమని ఆటపట్టిస్తారు. కానీ ఇక్కడ రోటీన్‌కి భిన్నంగా జరిగింది. ఆ కొత్త జంటకు ఏకంగ బీరు సీసాలు తీసుకొచ్చి ఇచ్చారు.
మరి ఆ పెళ్లి జంట ఏంచేశారో తెలుసా.. ఫ్రెండ్స్ ఇచ్చిన ఆ బీర్ తాగి అక్కడున్నవారికి పెద్ద షాకిచ్చారు. పెళ్లికొడుకు బీర్ ఎత్తి గడగడా తాగేయగా.. పెళ్లికూతురు మాత్రం కొంత ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్‌లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవిత్రమైన పెళ్లిలో ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి ఆలస్యమెందుకు ఈ వీడియో మీరూ చూసెయ్యండీ..!
https://youtu.be/NvmoLxIu3m4