సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతులను లాభాల బాట పట్టించేందుకు వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నియంత్రిత పద్దతిలో రైతులతో వ్యవసాయం చేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు,రైతు బందు కమిటి,సభ్యులు అధికారుల పైన ఉందని అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిట పిఎసిఎస్ చైర్మన్ జక్కా రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో నియంత్రిత వ్యవసాయ విధానంపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరై ప్రజాప్రతినిధులకు పలు విలువైన సూచనలు చేశారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతులు లాభాల బాటలో ఉంటారని. ప్రభుత్వం చెప్పే విధానాన్ని రైతుల అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు,అనంతరం పిఎసిఎస్ లో ఎరువుల విక్రయాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా రైతులనుంచి రుణాల కోసం దరఖాస్తులను స్వీకరించారు.