కెనడా నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ

24
- Advertisement -

కెనడా నూతన ప్రధానికగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. జస్టిన్‌ ట్రూడో వైదొలగడంతో కొత్త సారథిని ఎన్నుకుంది లిబరల్‌ పార్టీ. తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు మార్క్‌ కార్నీ. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్‌ ట్రూడో జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో నూతన సారథి ఎన్నిక లాంఛనమైంది.

59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లైంది. మొత్తం 150,000 పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, కార్నేకు 131,674 ఓట్లు వచ్చాయి.

1965లో ఫోర్ట్‌ స్మిత్‌లో జన్మించిన మార్క్ కార్నీ, హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన కార్నీ, 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం లిబరల్స్‌లో ప్రధాని రేసులో ఉన్న నలుగురు అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు. దీంతోపాటు ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగా నిలిచారు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్‌లో పనిచేసిన అనుభవం లేని కార్నీ, కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Also Read:కాంగ్రెస్‌కు 3..బీఆర్ఎస్‌కి 1, సీపీఐ1

- Advertisement -