‘ప్రిన్స్’ నుండి మరియా ఫస్ట్ లుక్..

182
Maria Ryaboshapka
- Advertisement -

వెర్సటైల్ హీరో శివకార్తికేయన్, ట్యాలెంటడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్‌’ చిత్రంతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్నారు. ‘ప్రిన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్న యూనిట్ ఈ రోజు సినిమాలో కథానాయిక మరియా ర్యాబోషప్కా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ శివకార్తికేయన్,మరియా ర్యాబోషప్క జంట గోడ పైన కూర్చుని హాయిగా నవ్వుతూ కనిపించారు. తెలుగు అర్ధం కాని ర్యాబోషప్కకు శివకార్తికేయన్ సుమతి శతకం భోదిస్తున్నట్లుగా ఉంటడం చాల ఆసక్తికరంగా వుంది. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. శివకార్తికేయన్ కూల్ అండ్ క్లాస్ గా, మరియా ర్యాబోషప్కా చాలా అందంగా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లానే ఈ కొత్త పోస్టర్ కూడా పాజిటివ్ వైబ్స్ తో అలరించింది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా , ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ పని చేస్తున్న ఈ చిత్రానికి అరుణ్ విశ్వ సహ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు.

తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి
సంగీతం: ఎస్ థమన్
నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్
సమర్పణ: సోనాలి నారంగ్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: మనోజ్ పరమహంస
సహ నిర్మాత: అరుణ్ విశ్వ
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ : నారాయణ రెడ్డి
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -