రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం- మారెడ్డి

569
- Advertisement -

నేడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత సవంత్సరం కంటే ధాన్యం కొనుగొల్లు ఎక్కువ చేపట్టాలని.. అందుకావలసిన ప్రణాళికలు చేయాలని.. రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ ఆకున్ సబర్వాల్‌, పౌరసరఫరాల శాఖ సంబంధించిన ఉన్నతధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్ అంటే బాగా తెలుసు.. కానీ ఇప్పుడు సివిల్ సప్లై అంటే తెల్సు.. సీఎం కేసీఆర్ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ పాటు ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో ఈ సారి పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం.. సీఎం కేసీఆర్ కూడా అదే చెప్పారని మారెడ్డి అన్నారు.

గత రబీలో పడిన ఇబ్బందులు లేకుండా ఈ సారి కొనుగోలు చేస్తాం. ఇప్పుడు 77 లక్షల 36 670 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం. దానికి సంబంధించి ఇప్పటికే 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

civil-supply

కొనుగోలుపై అందరూ ప్రజాప్రతినిధుల,అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాం. అన్ని శాఖల అధికారులతో కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మా కమిషనర్ ఇతర రాష్ట్రాలలో స్టడీ చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తాం. జాయింట్ కలెక్టర్ లకు ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నామన్నారు.

తేమ తక్కువగా ఉండే విదంగా రైతులు ధాన్యం తేవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు తేమ శాతంపై సూచనలు సలహాలు ఇవ్వాలి. సివిల్ సప్లై కి ఇప్పటికే నిధులు కేటాయింపు జరిగింది.సాంకేతికంగా మరింత మెరుగుపర్చము. రైతులు ఇబ్బందులు లేకుండా జర్నలిస్టులు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలి కోరుకుంటున్నామని చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ ఆకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. గత సంవత్సరం 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. ఈసారి 65 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రభుత్వం రైతు బంధు వలన ధాన్యం ఉత్పత్తి పెరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జలాల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. గన్ని బ్యాగ్ లు కూడా ఏర్పాటు చేశామన్నారు కమిషనర్‌.

ఇప్పటికే అనేక చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభం అయ్యాయి. కొన్న ధాన్చానికి గాను 2,3 రోజుల్లో రైతుల ధాన్యం డబ్బులు చెల్లిస్తాం. ఇలాంటి పద్దతి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఉండదు. ఇతర రాష్ట్రాల్లో 6 నెలల వరకు కూడా ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వరు. మన రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ఇతర దేశాలు, రాష్ట్రాలు వచ్చి స్టడీ చేశారు.

పౌరసరఫరాల శాఖలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో అందరి అధికారుల సమన్వయంతో పౌరసరఫరాల శాఖలో పని చేయడం చాలా సంతోషంగా భావిస్తున్న.. రాష్ట్రంలో రేషన్ కార్డ్‌లు ఇవ్వడం నిరంతర కొనసాగే పక్రియ.. ఇప్పటివరకు 87 లక్షల రేషన్ కర్డ్స్‌ ఉన్నాయన్నారు అకున్‌ సబర్వాల్‌.

- Advertisement -