కాంగ్రెస్ నాయకుల మాటలు బాధాకరం..

255
mareddy
- Advertisement -

పౌరసరఫరాల శాఖపై కాంగ్రెస్ నాయకుల మాటలు బాధాకరమన్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 12కిలోల బియాన్ని 91 శాతం మంది రేషన్ తీసుకున్నారు. 87లక్షల మందికి ఇచ్చాము. 13 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా బియ్యం తీసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో 32 నుంచి 38 రూపాయలకు కిలో బియ్యం కొని పేద ప్రజలకు పంపిణీ చేశామన్నారు.

3.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నాం. వలస కార్మికులకు 30 కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ చేశాం.74 లక్షల మందికి 1500 రూపాయలు ఖాతాలో జమ చేశాం.కంది పప్పు నాఫెడ్ ద్వారా తీసుకోవాలని కేంద్రం సూచించింది. అందుకు 224 కోట్లు ఖర్చు అవుతుంది. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది ఖాతాదారుల అకౌంట్లలో 1500 డబ్బులు జమ కాలేదు.దాన్ని పరిశీలించి వారికి కూడా డబ్బులు వేస్తామన్నారు.

- Advertisement -