ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఆహారం..

155
- Advertisement -

లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటి నుండి ప్రతి రోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ హబ్సిగూడ, విజయపురి కాలనీ, మారుతీ నగర్, చైతన్యపురి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల్లో, అనాదాశ్రమాల్లో, పారిశుధ్య కార్మికులకు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలకు చెందిన వలస కార్మికులకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూలీలకు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భోజనాన్ని అందించారు.

uppala foundation

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌ల ఆదేశాలమేరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలి కోరారు. అలాగే మూడవ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే వరకు తనవంతుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆహారాన్ని, నిత్యావసరాలు అందిస్తూనే ఉంటానని తెలియజేసారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో ఐవీఎఫ్ నాయకులు పబ్బా చంద్రశేఖర్, కూర నాగరాజు, కటకం శ్రీనివాస్, విశ్వేశ్వర్, విశ్వజ్యోతి, లక్ష్మీ నరసింహ, అనిల్ ప్రసాద్, ఐవీఎఫ్ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

uppala foundation help

- Advertisement -