సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున కోటి మొక్కల కానుక..

156
maareddy
- Advertisement -

ప్రియతమ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు జన్మదిన సందర్భంగా, టీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన, ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమం “కోటి వృక్షార్చన”లో పౌర సరఫరాల సంస్థ తరపున, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నామని పౌర సరఫరాల ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఈ రోజు “కోటి వృక్షార్చన” పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలు, రైస్ మిల్ ప్రాంగణాల్లో, గోదాముల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అంతే కాక, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో, అన్నదాన కార్యక్రమాలు, ప్రధాన దేవాలయాలలో ముఖ్యమంత్రి పేరు మీద ప్రత్యేక పూజలు జరపనున్నామని తెలిపారు. ఈ మొక్కలు నాటిన ఫోటోలను 9000365000 నెంబర్ కు వాట్సాప్ చేసి ఈ కార్య్క్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -