- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండగా టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకోగా. హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత రూ.5 కోట్లు మార్కు దాటింది.
తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 520వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 18వ తేదీ సాయంత్రం తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. ఇక చెన్నై నగరంలోని జిఎన్ చెట్టి వీధిలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు సోమవారం ప్రారంభంకాగా మార్చి 17వ తేదీన మహాకుంభాభిషేకం, ప్రాణప్రతిష్ట జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -