ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్స్‌పై A.R.K శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిబు నైనన్ థామస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోలు నాని, అల్లరి నరేష్, దర్శకులు కిషోర్ తిరుమల, కళ్యాణ్ కృష్ణ, సంకల్ప్, రవికాంత్ పేరెపు, తనికెళ్ళభరణి, కోన వెంకట్, ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని తదితరులు పాల్గొన్నారు. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముందుగా.. కీర్తిశేషులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి నివాళి.. ఆడియో కార్యక్రమానికి ముందుగా.. ఇటీవలే తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఏవరు పిలిచినా నేనున్నా అంటూ అందరి సమస్యలు తన సమస్యగా భావించి , సమస్య పరిష్కరించేవరకూ నిద్రపోకుండా నిరంతరం శ్రమించే దర్శకరత్న ని కోల్పోయాం. తెలుగు వాడి హ్రుదయాల్లో చెరగని చోటు సంపాయించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి నివాళి అర్పించి.. ఆయన ఆత్మ శాంతించాలని నిమిషం పాటు మౌనం పాటించారు.
కోన వెంకట్ మాట్లాడుతూ – ”ఎక్కడి వెళ్ళినా అక్కడున్న వారందరికి తక్కువ సమయంలోనే ఫ్యామిలీ మెంబర్ అయిపోయే గొప్ప లక్షణమున్న వ్యక్తి ఆది పినిశెట్టి. అలాగే తన స్క్రిప్ట్ సెలక్షన్స్ సూపర్బ్. మరకతమణి సినిమా కథ కూడా మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
సంకల్ప్ మాట్లాడుతూ – ”కాన్సెప్ట్ సినిమాలకు మంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను రూపొందించిన శరవణన్‌కు ఆల్ ది బెస్ట్. అందరికీ కంగ్రాట్స్” అన్నారు.
తనికెళ్ళభరణి మాట్లాడుతూ – ”టాలెంట్‌తో పాటు మంచి మనసున్న వ్యక్తి రవిరాజా పినిశెట్టిగారు. ఆయనలోని మంచి లక్షణాలన్నీ ఆదికి వచ్చాయి. తొలి నుండి ఆది డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలనే చేస్తున్నాడు. మరకత మణి సినిమా తనకు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రవికాంత్ పేరెపు మాట్లాడుతూ – ”నాకు ముందు నుండి ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్న వ్యక్తుల్లో ఆది పినిశెట్టి ఒకరు. తను హీరోగా చేసిన మరకతమణి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
కిషోర్ తిరుమల మాట్లాడుతూ – ”మంచి సంగీతం ఉంది. మంచి సినిమాటోగ్రఫీ కనపడుతుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్” అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ – ”ఆది తొమ్మిదేళ్ళుగా నాకు బాగా తెలుసు. సినిమా కోసం కొత్త నటీనటులు ఎలా ప్రయత్నిస్తారో అలా ప్రయత్నిస్తూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తను ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.
ఎఆర్‌కె.శరవణన్ మాట్లాడుతూ – ”ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునేవారికి లేదు ఇంకా చాలా ఉంది. టాలీవుడ్ ఇంకా చాలా పెద్ద ఇండస్ట్రీ అని నిరూపించిన టాలీవుడ్‌కు హ్యాట్సాఫ్. మరకతమణి సినిమా కథ యూనివర్సల్ పాయింట్‌తో రూపొందింది కాబట్టి సినిమాను తెలుగులో కూడా చేస్తామని ఆదిగారు ముందు నుండే ఎంకరేజ్ చేశారు. అందుకు తగిన విధంగా సపోర్ట్ అందించారు. అందరికీ థాంక్స్” అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ – ”దాసరిగారు ఈరోజు మన మధ్య లేరు. సినిమా అనేది హీరో సినిమా కాకుండా దర్శకుడి సినిమా కావాలనేది ఆయన కల. ఆయన కలలో ఇవ్వాల్టి హీరోలందరూ భాగమైతే ఆ కల నిజమైనట్లే. ఇక మరకతమణి విషయానికి వస్తే సంగీతం చాలా బావుంది. ట్రైలర్ బావుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దిబు నినన్ థామస్ మాట్లాడుతూ – ”మ్యూజిక్ డైరెక్టర్‌గా నా తొలి తెలుగు సినిమా. సినిమాలో ఐదు పాటలుంటాయి. ప్రతి పాట డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నాకు సహకారం అందించిన అందరికీ థాంక్స్. శరవణన్‌గారు, నిర్మాతలు నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు” అన్నారు.
రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ – ”ఈ యంగ్ జనరేషన్ హీరోలను చూసి జెలసీగా ఉంటుంది. అందరూ బేషజాలు లేకుండా కలిసిపోతున్నారు. ఇక ఆదికి త్వరలోనే పెళ్ళి చేయాలనుకుంటున్నాం. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా పెద్ద హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు, డబ్బులు తేవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ – ”సినిమా స్క్రిప్ట్ బేస్‌డ్ మూవీ. ఓ ఐదుగురి క్యారెక్టర్స్‌ను బేస్ చేసుకుని రన్ అవుతుంటుంది. స్క్రిప్టే సినిమాలో హీరో. ఇప్పటి వరకు నేను సీరియస్ పాత్రలే చేశాను. నేను నటించిన తొలి కామెడి సినిమా అని చెప్పొచ్చు. డైరెక్టర్ శరవణన్ ఆలోచనతో చేసిన ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది. దిబు థామస్‌గారు తన ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాకు ప్రాణం పోశారు” అన్నారు.