ఎన్టీఆర్‌కు మొగుడు..!

273
jr-ntr-s-son-abhay-ram-gave-surprise-manchu-manoj
- Advertisement -

తారక్‌కి సరైన మొగుడు ఆయన తనయుడు అభయ్‌ రామ్‌ అని మంచు మనోజ్‌ ట్విట్లర్లో ఓ పోస్ట్ చేశారు. మనోజ్‌ తారక్‌ ఇంటికి వెళ్లగా…అక్కడ ఆయనకు అభయ్‌ చల్లటి నీళ్లు ఇచ్చి స్వాగతం చెప్పాడట. ఈ సందర్భంగా తీసిన ఫొటోను మనోజ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘చల్లటి నీళ్లతో నాకు స్వాగతం. తారక్‌కి కరెక్ట్‌ మొగుడు నా బుజ్జి అభయ్‌ కుట్టి’ అని మనోజ్‌ ట్వీట్‌ చేశారు. తారక్‌ ఎనర్జీతో పోలిస్తే అభయ్‌ ఎనర్జీ వందరెట్లు ఎక్కువ ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తారక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

Jr NTR Lakshmi Pranathi Son Abhay Ram Latest New HD Photos Images

జూనియర్ ఎన్టీఆర్‌కు మంచు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మోహన్‌బాబు అంటే ఎన్టీఆర్‌కు చాలా అభిమానం. అలాగే తారక్ అంటే మంచు విష్ణు మనోజ్‌కు బాగా ఇష్టం. సినిమా సంబంధాలకు అతీతంగా వారి మధ్య రిలేషన్ ఉంది. కాగా, అభయ్ రామ్ ఇప్పటికే మాట్లాడేస్తున్నాడని, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంపై చాలా ఆసక్తి చూపుతున్నాడని చెబుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్లో ‘జై లవ కుశ’ సినిమా తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. మరోవైపు మంచు మనోజ్‌ ప్రస్తుతం ఎల్‌.టి.టి.ఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో నటిస్తున్నాడు. మిలిటెంట్‌ లీడర్‌ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మంచు మనోజ్‌ స్టూడెంట్‌ కోసం దాదాపు 15 కేజీలు తగ్గడం విశేషం.

- Advertisement -