మార్క్‌ ఫెడ్‌ఛైర్మన్‌గా మార గంగారెడ్డి..

492
ktr
- Advertisement -

మార్క్ ఫెడ్‌ ఛైర్మన్‌గా మార గంగారెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్‌. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ కు చెందిన మార గంగారెడ్డి ని నియమించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు గంగారెడ్డి. టీఆర్ఎస్ ఆవిర్భా వం నుంచి కేసీఆర్ వెంటే ఉండి… ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. పార్టీలో పలు పదవులు నిర్వహించిన ఆయన విధేయతకు పట్టం కట్టింది టీఆర్ఎస్ అధిష్టానం. తన నియమకానికి సహకరించిన మంత్రి కేటీఆర్, జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్న గంగారెడ్డి.. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2013లో అంకాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

- Advertisement -