గాంధీ ఆస్పత్రిలో వార్డులను పరిశీలించిన మంత్రి ఈటల..

273
- Advertisement -

సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ . శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రి చేరుకున్న ఆయన కరోనా వైరస్ నేపథ్యంలో గాంధీలో వార్డును పరిశీలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రి డాక్టర్లలతో కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశమయ్యారు.

ఇక మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు కేంద్రం మంత్రి హర్షవర్ధన్. కోవిడ్-19ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించారు.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని.. మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించాలని హర్షవర్ధన్ సూచించారు. ఈ సందర్భంగా ఎన్‌-95 మాస్క్‌లను అందించాలని, మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి ఈటల.

కరోనా వైరస్‌ ప్రస్తుత పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి, నమోదైన కేసులు… తదితర అంశాలపై కేంద్ర మంత్రికి వివరణ ఇచ్చారు.

minister etela

- Advertisement -